Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఉపాధి హామీ నిధుల గోల్ మాల్ -- బోథ్ ఎంపీడీవో సస్పెండ్...

Author
Posted By HINDUSTAN
| 09 Apr 2022, 10:10 AM | క్రైమ్


తక్షణమే సస్పెన్షన్ అమల్లో వస్తుందని ఉత్తర్వులు జారీ చేసినా జిల్లా కలెక్టర్



రిపబ్లిక్ హిందుస్థాన్,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో బోథ్ ఉపాధిహామీ అక్రమాలపై అధికారులను ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు నిలదీయడంతో సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. బోథ్ మండలంలోని ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగిందని, ప్రజా వేదికకు సంబంధించిన నివేదిక ఇవ్వలేదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు జడ్పీ సర్వసభ్య సమావేశం నుండి వాకౌట్ చేశారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా కూలీలకు పని కల్పించకుండా తన భర్త పేరుపై నకిలీ బిల్లులు సృష్టించిన బోథ్ ఎంపీడీవో రాధపై జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ సస్పెన్షన్ వేటు వేశారు. కాగా ఎంపీడీవో రాధా సస్పెన్షన్ను వెనక్కి తీసుకోవాలని ఎంపీపీ తుల శ్రీనివాస్ జడ్పీ సర్వసభ్య సమావేశంను వాకౌట్ చేశారు.



విచారణ జరిపిన అనంతరమే సస్పెండ్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అవినీతికి పాల్పడిన వారందరినీ సస్పెండ్ చేస్తామన్నారు. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కలెక్టర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి



అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఇలా ఒకరు చర్యలు తీసుకోవాలని, ఒకరు సస్పెన్షన్ వెన్నకి తీసుకోవాలని వాకౌట్ చేయడం తో ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు ఆశ్చర్యానికి లోనయ్యారు...



ఏదేమైనా బోథ్ ఉపాధి హామీ పథకం లో అవినీతికి పాల్పడిన అధికారుల సస్పెన్ష పర్వం కొనసాగుతూనే ఉంది.