Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

Ramagundam:అంకితభావంతో విధులు నిర్వహించాలి…

Author
Posted By HINDUSTAN
| 03 Sep 2021, 02:09 PM | పెద్దపల్లి



-రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్



రిపబ్లిక్ హిందూస్థాన్ , రామగుండం : దండేపల్లి, జన్నారం పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజల నమ్మకాని పొందాలని సిబ్బందికి పిలుపునిచ్చారు.



రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ దండేపల్లి, జన్నారం పోలీస్ స్టేషన్ల ను సందర్శించారు. మంచిర్యాల డి.సి.పి ఉదయ్ కుమార్ రెడ్డి, మంచిర్యాల ఎ.సి.పి అఖిల్ మహాజన్ ఐపీఎస్, ఇన్స్పెక్టర్ నారాయణ నాయక్ తో కలిసి పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశీలంచారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది వివరాలను, పనితీరుతో పాటు స్టేషన్ లో నమోదయ్యే కేసులు మరియు అత్యధికంగా ఎలాంటి కేసులు నమోదు కాబడుతాయి.

ఇవి కూడా చదవండి





నేరాల నియంత్రణ, ప్రధాన రోడ్డు మార్గంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులను ను పోలీస్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా విధుల్లో రాణించడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలందించించేందుకు రూపొందించబడిన వర్టికల్స్ విధానంపై,5s ఇంప్లిమెంట్ పై సిబ్బంది మరింత అవగాహన పెంపొందించేందుకు అధికారులకు సిబ్బందికి శిక్షణ అందజేయాల్సి వుంటుందని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఫిర్యాదుదారులతో పోలీస్ కమిషనర్ సమస్యను అడిగి తెలుసుకోవడంతో పాటు త్వరితగతిన సమస్యను పరిష్కరించాల్సిన సీఐ మరియు ఎస్ ఐ లను అదేశించారు.
ఈ కార్యక్రమములో జన్నారం ఎస్ ఐ ఆది మధుసూదన్ రావు తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది వున్నారు.