మహిళా ఎస్సై పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు
Thank you for reading this post, don't forget to subscribe!అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జిల్లా పోలీసు అధికారుల సఘం
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
తేదీ ఏప్రిల్ 24 జైనథ్ మండలం లో విశాల్ s/o విఠల్,వివేక్ s/o విఠల్ లపై మహిళ ఎస్ ఐ బి పెర్సిస్ cr no 69/2022 U/Sec 307,506 r/w 34 PS జైనత్ కేసులో రిమాండ్కు పంపడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం జైనథ్ పోలీస్ స్టేషన్కు ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు పాయల్ శంకర్ అతని అనుచరులతో కలిసి జైనథ్ పోలీస్ స్టేషన్కు వచ్చి రోడ్డుపై బైఠాయించి మహిళా ఎస్సై బి పెర్సిస్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆదిలాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఒక మహిళ ఎస్సై పై నిరాధారమైన, అనుచితమైన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో చేయడం, ఒక మహిళ ఎస్ఐ ను కించపరచడం చాలా బాధాకరం, సబబు కాదని ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే ఏ పార్టీకి సంబంధించిన వారిపైన అయినా తీవ్రంగా పరిగణించ బడతాయని అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు హెచ్చరించారు. భేషరతుగా జిల్లా బిజెపి అధ్యక్షుడు పాయాల్ శంకర్ మహిళా ఎస్సై కు క్షమాపణ చెప్పి, తన నిరాధారమైన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని తెలిపారు. జిల్లా పోలీసు అధికారుల సంఘం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.