Date: 13 March 2022, 5:42 pm Editor: Republic Hindustan
republichindustan.in

SadNews : చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి


🔶 చిన్న గురిజాల గ్రామంలో విషాదం…

🔶 ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన తాత, కొడుకు, మనుమడు…

🔶 వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి….

🔶 ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందడంతో కన్నీరుమున్నీరైన గ్రామస్తులు….

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, నర్సంపేట :

నర్సంపేట మండలం చిన్న గురిజాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను సందర్శించి కన్నీరు పెట్టుకున్నారు..
ఒకే కుటుంబానికి  చెందిన మూడు తరాలు మృతి చెందంతో గ్రామస్తులందరు కన్నీరుమున్నీరయ్యారు.
ప్రమాదవశాత్తు మరణించిన వారి మృతి పట్ల ఎమ్మెల్యే గారు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
మూడు తరాలకు చెందిన తాత క్రిష్ణమూర్తి, కొడుకు నాగరాజు, మనువడు లక్కీ మృతి చెందడంతో  వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబం లో ముగ్గురు మృతి చెందడం తో గ్రామం లో విషాదచ్చాయాలు అలుముకున్నాయి.

Facebook WhatsApp Telegram Back to Home