republichindustan.in
Newspaper Banner
Date of Publish : 09 October 2024, 3:09 am Digital Edition : REPUBLIC HINDUSTAN

ఇచ్చోడ బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో అమ్టే మాధవ్ రావ్..?

ఇచ్చోడ :  రానున్న జడ్పిటిసి ఎన్నికల్లో ఇచ్చోడ మండల జడ్పీటీసీ స్థానానికి బీజేపీ సీనియర్ నాయకులు మరియు బీజేపీ ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు  అమ్టే మాధవ్ రావ్.. పోటీ చేయనున్నట్లు సమాచారం. 
గత 35 ఏళ్లుగా బీజేపీ పార్టీలో ఉంటూ పార్టీకి సేవలు అందిస్తున్నారు. అయితే ఆయన సుదీర్ఘకాలం పాటు బిజీ పార్టీతోనే ఉన్నారు.
ఒకరిద్దరు నాయకులు ఉన్నప్పటి నుండి బీజేపీ కోసం పనిచేస్తున్నారు. 

అయితే ఈసారి ఎన్నికల్లో పార్టీ మెజార్టీ నాయకులు ఆమ్టే ను జడ్పిటిసి ఎన్నికల బరిలో నిలపాలని యోచిస్తున్నట్లు సమాచారం .

అందరితో కలిసి మెలసి ఉండే మాధవ్ రావ్ ఈ సారి బరిలో ఉంటే పార్టీ కి గెలుపు అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి.

అందరితో కలివిడిగా ఉండే అమ్టే ఈసారి ఎట్టిపరిస్థితిలోనూ జెడ్పిటిసిగా గెలిపించాలని కృత నిశ్చయంతో ఉన్నారు .
మాధవరావు 1990 నుండి బిజెపి పార్టీ కోసం పని చేస్తున్నారు.  అసెంబ్లీ కన్వీనర్ గా, జిల్లా కార్యదర్శిగా ,  జిల్లా ఉపాధ్యక్షుడిగా, కిసాన్ మోర్చ అధ్యక్షుడిగా ,  ఇప్పుడు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు.

పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమే : అమ్టే మాధవ్ రావ్
పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమేనని అన్నారు. బీజేపీ లో పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని అన్నారు. జడ్పీటీసీ గా పోటీ చేసి భారీ మెజారిటీ తో గెలిచి పార్టీ కి బహుమతిగా ఇస్తానని అన్నారు. మండల ప్రజలు కూడా చాలామంది పోటీలో ఉండాలని కోరుతున్నారని అన్నారు.