ఇచ్చోడ : మండల కేంద్రంలో ఒక యువకుడు ఆత్మహత్య కు చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది..కదం మురళి కృష్ణ అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. అందరితో కలివిడిగా ఉండే కదం మురళి కృష్ణ మరణ వార్త విన్న స్నేహితులు, ప్రజలు తనను చూడడానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబానికి పెద్ద దిక్కు ఐనా కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. తండ్రి కదం ఆనందరావు గతంలో వైయస్సార్ సిపి పార్టీ మండల క్రియాశీల నాయకునిగా పని చేశాడు. ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతునికి భార్య,పిల్లలు ఉన్నారు.