Friday, February 7, 2025

తెలంగాణాలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ఆదివాసీ సేన అధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లాలో వ్యాప్తంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీలు ఘనంగా జరుపుకున్నారు.

మంగళవారం రోజు ప్రపంచ ఆదివాసీ  దినోత్సవం సందర్భంగా గుడిహత్నుర్ రైతు వేదిక భవనం నుంచి ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షులు ఉయిక లక్ష్మణ్ ఆధ్వర్యంలో డోల్, పేప్రే,కాలికోం సన్నాయి వాయిద్యాలతో ర్యాలీ గా రైతు వేదిక భవనం నుంచి గుడిహత్నుర్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల కుంరం భీం విగ్రహం వద్ద  కుంరం భీం విగ్రహాన్ని కి పూలమాలలతో నివాళులు అర్పించి
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షులు ఉయిక లక్ష్మణ్ మాట్లాడుతూ,5వ షేడ్యూల్డ్ ప్రాంతంలో 1/70,పెసా చట్టాని పకడ్బందీగా అమలు చేయాలని, అర్హత గల పొడు రైతులకు వేంటనే పోడు హక్కు పాత్రాలు వేంటనే ఇవ్వాలని,ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న గిరిజనేతరులకు మైదాన ప్రాంతంకు తరలించాలని, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను అమలు చేసి అర్హత గల నాన్ షేడ్యూల్డ్ ఆదివాసీ గ్రామాలకు షెడ్యూల్డ్ గ్రామాలుగా గుర్తించాలని  డిమాండ్ చేశారు.
ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షులు ఉయిక లక్ష్మణ్, ఆదివాసీ సేన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నాయకులు రాయిసిడం జంగుపటేల్, ఆదివాసీ సేన గుడిహత్నుర్ మండల అధ్యక్షులు సలాం జాకు,ఆదివాసీ సేన గుడిహత్నుర్ మండల ప్రధాన కార్యదర్శి సేడ్మాకి భీంరావ్, రాయి సేంటర్ సార్మేడిలు పేందోర్ జైరాం,కాత్లె భారత్,తుడుం దెబ్బ మండల అధ్యక్షులు ఉర్వేత రోహిదాస్,తుడుం దెబ్బ మండల ప్రధాన కార్యదర్శి పేందోర్ గోవింద్,గుడిహత్నూర్ జడ్పీటీసీ పతంగే బ్రహ్మానంద్, సర్పంచులు కుంర లింగు, ఆత్రం ప్రభాకర్,అర్క మహదు, తోడషం భారతిసుంగు, తిరుమల గౌడ్,సోయం భోజ్జు,జాదవ్ సునిత రమేష్, గూడిహత్నుర్ యస్ఐ ప్రవిణ్ కూమార్, ఆదివాసీ సేన నాయకులు రాయిసిడం భీలాజీ,కుంరం విష్ణు,కాత్లె పరసురాం,కోట్నక్ గోవింద్,కేశవ్ రావ్,పేందోర్ మారుతి వేడ్మ చంపత్ తదితరులు పాల్గొన్నారు.

గుడిహత్నూర్ మండలంలో

బజార్హత్నూర్ : బజార్ హత్నూర్ మండలం లో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని ప్రధాన కూడలి అయిన సోనాల వెళ్లే మార్గంలో శివాజీ మహారాజ్ విగ్రహ పరిసర ప్రాంతంలో బజార్ హత్నూర్.సర్పంచ్ పరచ లావణ్య సాయన్న మండలం లోని ఆదివాసి ల అందరి తో కల్సి అందరు ఆదివాసిలు  కొమరం భీమ్ చిత్రపటానికి పూజ చేసి పూలమాల వేసి  జెండానుఎగుర వేశారు.
ఈ  సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ఆదివాసీల ముద్దుబిడ్డ కొమురం భీం స్వా తంత్ర  పోరాటంలో తను చేసిన కృషి
మరువ లేనిదని  అదేవిధంగా ఆదివాసుల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప మహానీయుడని  . ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేశారు. మనమందరం కొమురం భీం అడుగుజాడల్లో నడిచి రాజ్యాంగ బద్ధమైన మన గిరిజన హక్కులను కాపాడుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామా లలోకూడాఆదివాసి దినోత్సవాన్ని గిరిజనులు డీజే పాటలతో నృత్యాలు చేస్తూ ఘనంగా నిర్వహించారు ఈ సందడి తో ఆదివాసీ పల్లెల్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఈకార్యక్రమం లో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు. ఎం పి టి సిల,  నాయకులు బహుజన సమాజ్ వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు  మెస్రం   జంగుబాపు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

బజార్ హత్నూర్ మండలం లో

నేరడిగొండ :  ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేరడిగోండ మండలం లోని గుత్పాల గ్రామంలో గిరిజనులు తమ ఆదివాసీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ పెందూర్ భీం రావ్, పూజారి సిడం హన్మంతు, గోడం లక్ష్మణ్, కినక దేవ్ రావ్, గోడం జుగేందర్, పెందూర్ గణపతి, జుగ్నక్ మారుతి, కుడ్మేత సోనేరావ్, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు

నేరడిగొండలో

Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!