republichindustan.in
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 4:25 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

ఖతార్‌లో అనారోగ్యంతో కార్మికుడు మృతి – స్వగ్రామానికి మృతదేహం రప్పింపు

జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, మాదాపూర్:
తెలంగాణకు చెందిన వలస కార్మికుడు బొమ్మల మధు (34) ఖతార్‌లో అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.

మాదాపూర్ గ్రామానికి చెందిన మధు ఉపాధి నిమిత్తం రెండు సంవత్సరాల క్రితం ఖతార్‌కు వెళ్లాడు. గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలంగాణ గల్ఫ్ సమితికి తెలియజేయగా, సమితి ప్రతిరోజూ ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ కుటుంబానికి సమాచారం అందిస్తూ వచ్చింది.

అయితే, రోజురోజుకు ఆరోగ్యం క్షీణించడంతో ఈ నెల 18వ తేదీన మధు మృతి చెందాడు. గల్ఫ్ దేశాల్లోని ప్రస్తుత పరిస్థితుల్లో కొంత అనుకూలత ఏర్పడటంతో, తెలంగాణ గల్ఫ్ సమితి అవసరమైన చర్యలను వేగంగా పూర్తి చేసి, మార్చి 23న మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చింది.

ఈ సందర్భంగా కష్టకాలంలో అండగా నిలిచిన తెలంగాణ గల్ఫ్ సమితికి మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే, సాటా వివిధ ప్రాంతాల అధ్యక్షులు మల్లేశన్, శ్రీనివాస్ మచ్చ, తేజ పళ్లెం తెలంగాణ గల్ఫ్ సమితి సేవలను అభినందించారు.