భర్త వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య…?

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :

ఓ భర్త తాళికట్టినా భార్యను అనుమానం తో రొజు వేదించడం తో విసుగు చెందిన సదరు మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇచ్చోడ గ్రామ శివారులో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు మరియు ఇచ్చోడ ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గుడిహత్నూర్ మండలం లోని లింగాపూర్ గ్రామానికి చెందిన రేణుక ను కుటుంబ సభ్యులు శివాఘాట్ గ్రామానికి చెందిన కైలాష్ తో 18 సంవత్సరాల క్రితం  బంధువుల సమక్షంలో ఇద్దరి వివాహం సంప్రదాయం ప్రకారం జరిపించారు. సజావుగా సాగుతున్న వీరి కాపురం లో రేణుక గ్రామం లోని ఓ వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త అయినా కైలాష్ అనుమానం పెంచుకున్నాడు. గత రెండు నెలలుగా ఇదే విషయం పై ఇద్దరి మధ్య తరుచు గొడవలు జరుగుతున్నాయి.
ఎన్నో సార్లు బంధువులు సర్దిచెప్పారు. అయినా కైలాష్ కు రేణుక పై ఉన్న అనుమానం పోలేదు.
ఇదే క్రమంలో కైలాష్ మరియు రేణుకను ఇద్దరినీ రేణుక కుటుంబ సభ్యులు లింగాపూర్ గ్రామానికి పిలిచారు. గొడవలు జరుగున్న క్రమంలో శుక్రవారం రొజు కైలాష్ తన బామ్మర్ది అయినా భగత్ మల్లేష్ కు ఫోన్ చేసి ని అక్క ఇచ్చోడా మండలం లోని శివశక్తి కంకర మిషన్ సమీపంలో పురుగుల మందు తాగి చనిపోయింది, శవం రిమ్స్ ఆసుపత్రి లో ఉందని  తెలిపాడు.  రిమ్స్ ఆసుపత్రి కి మల్లేష్ తన తల్లి లక్ష్మి తో కలిసి వెళ్లి చూడగా మార్చురి లో రేణుక చనిపోయి ఉన్నది. కైలాష్ వేధింపులు తట్టుకోలేక నే రేణుక ఆత్మహత్య చేసుకుందో లేక పురుగుల మందు తాగినప్పుడు కైలాష్ పక్కనే ఉన్నాడు కాబట్టి అతని పై అనుమానం ఉందని పిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.