— న్యాయం చేయాలని రాస్తారోకో.
— డీలర్ల పైన పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్
— కంపెనీల కమిషన్లకు కక్కుర్తిపడి రైతులకు నాసిరకం విత్తనాలు అంటగట్టారు..
— రైతుల ఆరోపణలు
— చాలా చోట్ల మొలకేత్తని సొయా విత్తనాలు….
— తనిఖీలకె పరిమితమైన అధికారులు ❓️
Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్,ఆదిలాబాద్ (బ్యూరో): రైతులు నకిలీ విత్తనాల బారిన పడి మోస పోకుండా సీజన్ కు రెండు నెలల ముందు నుండి అధికారులు పకడ్బందిగా చర్యలు చేపట్టిన రైతులు ఏదొక రకంగా మోసపోతూనే ఉన్నారు. తాజా గ నాసిరక విత్తనాలతో మోసపోయిన రైతులు ఆవేదన తట్టుకోలేక రోడ్డు పై బయటాయించి ధర్నా కు దిగారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది కంపెనీ నిర్వాహకులు, డీలర్లు రైతులకు నాసిరకమైన విత్తనాలు విక్రయించి రైతులను నట్టేట ముంచుతున్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలోనీ అంబేద్కర్ చౌరస్తాలో నాసిరకమైన సోయా విత్తనాలు కొనుగోలు చేసి మోసపోయామని రైతులు ధర్నా చేపట్టారు.

బజార్హత్నూర్ మండలంలోని కాండ్లీ గ్రామానికి చెందిన రైతులు కొనుగోలు చేసిన కరిష్మా, విక్రాంత్ సోయా విత్తనాలు చేన్లలో విత్తితే విత్తనాలు మొలకెత్త లేదని, తమకు న్యాయం చేయాలని ధర్నా చేపట్టారు. చాలా చోట్ల సొయా విత్తనాలు మొలకేత్తలేదు. రైతులు నిలువునా మోసపోయారు. పాత స్టాక్ సోయాను అంటగట్టినట్లు రైతులు అనుమానిస్తున్నారు. అధికారులు తమ చర్యలను ప్రకటనలకే పరిమితం చేయకుండా తమను మోసం చేసిన కంపెనీ, డీలర్ల పైన పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో రైతు సంఘం నాయకుడు జాదవ్ సుభాష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
