republichindustan.in
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 12:08 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

ప‌బ్లిక్‌లో ముద్దు పెట్టిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

-ఆమెతో రిలేష‌న్ క‌న్‌ఫాం చేసిన‌ట్టేనా?

హైదరాబాద్,నవంబర్13 :
‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీతో మరోసారి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న రష్మిక మందాన్నతాజాగా హాట్ టాపిక్ అయింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో, దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ది గ‌ర్ల్ ఫ్రెండ్‌ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ క్ర‌మంలో హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్ మీట్ వేడుక ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ ఈవెంట్‌కి రష్మిక మందాన్న స్నేహితుడు, స్టార్ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. ఈ సక్సెస్ మీట్‌లో అనూహ్య సన్నివేశం చోటు చేసుకుంది. విజయ్ దేవరకొండ రష్మిక చేతినిపబ్లిక్‌లోనే ముద్దు పెట్టాడు.

Thank you for reading this post, don't forget to subscribe!

ఈ సన్నివేశం చూసిన ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ ఆడిటోరియం ద‌ద్ద‌రిల్లేలా చేశారు.ఆ స‌మ‌యంలో రష్మిక కూడా సిగ్గుపడుతూ బ్లష్ అవ్వడం అభిమానులను మరింత ఆకట్టుకుంది.ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్లు, ఇటీవలే ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు రష్మిక గానీ, విజయ్ దేవరకొండ గానీ అధికారికంగా స్పందించలేదు. కానీ ఈ సక్సెస్ మీట్‌లో చోటు చేసుకున్న ఈ రొమాంటిక్ మూమెంట్ ఫ్యాన్స్‌లో కొత్త ఊహాగానాలకు తావిచ్చింది. ‘ది గర్ల్ ఫ్రెండ్’లో రష్మిక మందాన్న నటనపై ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ఎమోషనల్ సీన్స్‌, న్యాచురల్ ఎక్స్‌ప్రెషన్స్ సినిమాకు బలమని అభిమానులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. రష్మికకు ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. ఫ్యాన్స్ అయితే, “ఇది రీల్ కాదు, రియల్ లవ్ స్టోరీ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మొత్తం మీద, ‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ మీట్ రష్మిక – విజయ్ దేవరకొండ జంట రొమాంటిక్ మూమెంట్‌తో మ‌రింత హైలైట్ అయ్యారు. ఇక ఈవెంట్‌లో ర‌ష్మిక మాట్లాడుతూ.. మనలైఫ్‌లో విజయ్‌ దేవరకొండ లాంటి వారు ఉండటం ఒక వరం అని తెలిపింది. ప్రతి ఒక్కరి జీవితంలో విజయ్‌ లాంటి వారు ఉండాలని ఆమె చెప్పడం అంద‌రిలో కొత్త అనుమానాలు క‌లిగిస్తున్నాయి. విజయ్‌ తనని మొదటి నుంచి ప్రోత్సహిస్తూనే ఉన్నాడని, ఈ సినిమా విజయంలోనూ భాగస్వామి అయ్యాడని, ఈ సినిమా మొత్తం జర్నీలో తన వెంటే ఉన్నాడని, అన్ని రకాలుగా అండగా నిలిచాడంటూ ర‌ష్మిక చెప్ప‌డం కొస‌మెరుపు