పులిగిల్ల ప్రాథమిక పాఠశాలలో ఏడవ తరగతి పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్న విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు.
Thank you for reading this post, don't forget to subscribe!
ఏడు సంవత్సరాలు చదువు పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్న విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు పి సంపత్ రెడ్డి విద్యార్థులకు మంచి సలహాలు సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా పోరిక రాజు నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఎలా కష్టపడి చదవాలి జీవితంలో ఎదగాలంటే చదువుతోపాటు క్రమశిక్షణ, పెద్దలను గౌరవించడం ,ప్రతి విద్యార్థి మంచి గుణాలను కలిగి ఉన్నప్పుడే జీవితంలో పైకి రాగలరని విద్యార్థులకు మంచి సలహాలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వరూపా మేడం,సతీష్ సార్ ,మహేందర్ సార్ ,సునీత మేడం,కవిత మేడం,గ్రామ ప్రజలు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.