రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ” మానవ సేవే మాధవ సేవ సమితి అదిలాబాద్ ” ఆధ్వర్యంలో ఆదివారం అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించారు . నేరడిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో తేదీ 25.05.2022 బుధవారం రోజున చనిపోయిన గుర్తుతెలియని అనాథ శవానికి అంతక్రియలు చేయుట గురించి ఎవరు ముందుకు రానందున మానవసేవే మాధవ సేవ సమితి సభ్యులను నేరడిగొండ ఎస్ఐ సమితికి సమాచారం అందించగా తిరుపేల్లి స్మశాన వాటికలో అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానవ సేవే మాధవ సేవ సమితి సభ్యులు చౌహన్ శశికళ , చిందం దేవిదాస్ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ కానిస్టేబుల్ అదిలాబాద్ , కనుక నర్సింగ్ అనాధ శవానికి అంతక్రియలు నిర్వహించినారు .
Thank you for reading this post, don't forget to subscribe!