republichindustan.in
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 4:20 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

హార్టెక్ మరియు ఆరోగ్య జ్యోతి ఎన్జీవో ఆధ్వర్యంలో…<br> అన్నదానం పండ్ల పంపిణీ రక్తదాన శిబిరం

హిందుస్థాన్, అదిలాబాద్ రిమ్స్: ఆదిలాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జనరల్ ఆసుపత్రి లో హార్టెక్ మరియు ఆరోగ్య జ్యోతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేదలకు పండ్లు మరియు అన్నదాన కార్యక్రమాన్ని ఆరోగ్య జ్యోతి స్వచ్చంద సంస్థ అధ్యక్షులు కే నరేష్ కుమార్ హార్టెక్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు నక్క భారతి ఆధ్వర్యంలో నిర్వహించారు.

Thank you for reading this post, don't forget to subscribe!

అనంతరం రిమ్స్ బ్లడ్ బ్యాంకులో రక్తదాన నీ శ్రీకాంత్ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. స్వచ్ఛంద సేవలు చేయడంలో ఆరోగ్య జ్యోతి మరియు ఆర్థిక సాధ్యమ సంస్థలు ఎప్పుడు ముందుంటాయని తెలిపారు. విద్యా వైద్యం వ్యవసాయం ఆరోగ్యంతో పాటు అన్ని రంగాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం సేవా కార్యక్రమాలు చేయడం గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

సేవా కార్యక్రమాలు చేయడంలో రెండు స్వచ్ఛంద సంస్థలు ఎప్పుడు ముందు ఉంటాయని వారు వివరించారు. రాబోయే రోజుల్లో అందరి సహాయ సహకారాల తో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం శ్రీకాంత్ జన్మదిన సందర్భంగా శ్రీకాంత్ రక్తదానం నిర్వహించారు. శ్రీకాంత్ ఇప్పటివరకు ఎన్నో రక్తదానాలు చేయడం జరిగింది. ఆరోగ్య జ్యోతి ఆర్థిక సచిన సంస్థ అధ్యక్షులు శ్రీకాంత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.