Thank you for reading this post, don't forget to subscribe!
ఆదిలాబాద్ : ద్విచక్రవాహనానికి తప్పుడు నెంబరు ప్లేటు పెట్టుకొని తిరుగుతున్న చోదకునిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఇన్స్పెక్టర్ కే.నాగరాజు తెలిపారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం సిరికొండకు చెందిన ఇంద్రూ అనే వ్యక్తి తన ద్విచక్రవాహనానికి టీఎస్ 01 ఈఎల్ 4565 నెంబరు ప్లేటుతో వెళుతుండగా ట్రాఫిక్ ఎస్ఐ మహేందర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహన ఛాసిస్ నెంబరు ఆధారంగా పరిశీలించగా ఆ వాహనం అసలు నెంబరు ఎంహెచ్ 29 బీజీ 0885 అని గుర్తించారు. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకొని టూటౌన్లో ఎస్ఐ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. `నెంబర్లు మార్చి వాహనాలపై పెట్టుకుంటే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.