republichindustan.in
Newspaper Banner
Date of Publish : 10 October 2021, 5:02 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

వ్యవసాయ మోటార్లను దొంగతనం చేసే ఇద్దరు దొంగల అరెస్టు

రిపబ్లిక్ హిందుస్థాన్ , రామగుండం : సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో పత్రిక సమావేశం ఏర్పాటు చేసి వ్యవసాయ మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల అరెస్ట్ వివరాలు వెల్లడించడం జరిగింది.
వివరాల్లోకి వెళితే….
సుల్తానాబాద్ ఎస్ఐ ఉపేందర్ మరియు తన సిబ్బందితో కలిసి విలేజ్ పెట్రోలింగ్ చేస్తుండగా సుద్దాల గ్రామ శివారులో ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ నెంబర్ AP15B0273 పై రెండు కరెంటు మోటార్ లను పట్టుకొని వస్తుండగా ఎస్సై వారిని ఆపి వారి వివరాలను అడగగా .. ఓజ్జా రవి, సుద్దాల, ఇరుగురాళ్ల తిరుపతి, సుద్దాల అని వారి వివరాలు చెప్పడం జరిగింది.

Thank you for reading this post, don't forget to subscribe!

దొంగల నుండి స్వాధీనం చేసుకున్న విద్యుత్ మోటారులు

కరెంటు మోటార్ల గురించి అడిగా పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానంతో గత వారం రోజుల క్రితం రేగడిమద్దికుంటా గ్రామం లో పోయిన వ్యవసాయ మోటార్లు గురించి విచారించగా అట్టి మోటార్లు గా ఒప్పుకున్నారు.

వారిని పూర్తిగా విచారించగ గతంలో వ్యవసాయం చేసే వారని వ్యవసాయంలో అంతగా అధిక రాబడి లేదందునా, జల్సాలకు అలవాటు పడి అప్పులు చేసి అట్టి అప్పులను తీర్చడం కోసం ఏలా అయిన డబ్బులు సంపాదించాలని పట్టుబడిన ఇరువురు ఒకే ఊరి వారు స్నేహితులు కూడా కావడంతో ఏదైనా దొంగతనం చేసి సులభంగా డబ్బులు సంపాదించి లాభం పొందుతామని నిర్ణయించుకొని ఇరువురు తేదీ 2-10- 21 రోజున మధ్యాహ్నం సమయంలో కల్వల నరేష్ అనే వ్యక్తి ఇంట్లో లేనిది గమనించి ఇంటి ముందు ఉన్న 09 తొమ్మిది కరెంటు మోటర్లను దొంగిలించుకుని మరియు సాయంత్రం బొంకురి శ్రీనివాస్ అనే వ్యక్తి యొక్క వ్యవసాయ బావి వద్ద కరెంటు మోటార్లు దొంగిలించి ఓజ్జా రవి ఇంట్లో దాచి పెట్టమని తెలిపారు.

ఈరోజు మోటార్లు అమ్మడానికి తీసుకు వస్తుండగా పోలీసులు పట్టుకోవడం జరిగింది. వీటి విలువ సుమారు 1,40,000/- వరకు ఉంటుంది. పోలీస్ వారు దొంగలు ఎత్తుకుపోయిన వ్యవసాయ మోటార్లు ను పట్టుకొని రైతులకు అప్పగించడంతో రైతుల ఆనందంతో పోలీసులను అభినందించారు…
నిందితుల వివరాలు

సుల్తానాబాద్ జిల్లా గొల్ల సుద్దాల కు చెందిన ఓజ్జా రవి (40) , మరియు ఇరుగు రాళ్ల తిరుపతి (50) లను దొంగతనం కేసులో పట్టున్నట్లు అధికారులు తెలిపారు.
పై ఇద్దరు దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహారించిన సుల్తానాబాద్ ఎస్సై ఉపేందర్ రావు, ఏఎస్సై తిరుపతి, పీసీ విష్ణూ మరియు ఇతర సిబ్బందిని సీఐ నగదు రివార్డ్స్ తో అభినందించారు.