republichindustan.in
Newspaper Banner
Date of Publish : 30 December 2023, 5:02 am Digital Edition : REPUBLIC HINDUSTAN

తెలంగాణకు కొత్త బస్సులు వచ్చేశాయి ఓచ్

హైదరాబాద్:డిసెంబర్ 30
తెలంగాణ రాష్ట్రంలోని ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందిం చేందుకు టీఎస్‌ఆర్టీసీ నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పు డు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్ధతుల ద్వారా ప్రయాణికులకు చేరువవు తోంది.

అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేసింది.ఈ ఆర్థిక సంవత్స రానికి గానూ రూ.400 కోట్ల వ్యయంతో అధునాతన మైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

వాటిలో 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సు లున్నాయి. వీటికి తోడు హైదరాబాద్ నగరంలో 540 పర్యావరణ హిత మైన ఎలక్ట్రిక్ వాహనాలు, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సు లను వాడకంలోకి టీఎస్ ఆర్టీసీయాజమాన్యం తెస్తోంది.

ఈ కొత్త బస్సులన్నీ విడతల వారీగా మార్చి 2024 నాటి కి ప్రయాణికులకు అందుబా టులోకి తీసుకు వచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది. మహాలక్ష్మి- మహి ళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా ఈ కొత్త బస్సులను వినియో గించుకోనుంది.

ఇప్పటికే.పెరిగిన రద్దీని దృష్ట్యా అద్దె బస్సులు కావాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటన కూడా ఇచ్చారు. ఈ నేప థ్యంలనే.. కొత్త బస్సులు తీసుకొస్తుండటంతో ప్రయా ణికులకు కొంత ఉపశమనం దొరకనుంది.

ఈ క్రమంలోనే.. అత్యాధు నిక హంగులతో కూడిన 80 కొత్త బస్సులు శనివారం నుంచి వాడకంలోకి వస్తు న్నాయి. వాటిలో 30 ఎక్స్ ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ నాన్ ఏసీ బస్సులు న్నాయి. ఈ కొత్త బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈరోజు ఉదయం 10 గంటలకు జరుగనుంది.

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి రవాణా, రహదారి భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, రవాణా శాఖ కమిషనర్‌ జ్యోతి బుద్దా ప్రకాశ్‌తో పాటు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనర్, ఇతర ఉన్నతాధికారులు హాజరవుతున్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!