Wednesday, February 5, 2025

వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆద్వర్యంలో 50 మంది గిరి రైతులకు శిక్షణ


రిపబ్లిక్ హిందుస్థాన్ , అదిలాబాద్ :వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో 50 మంది గిరిజానా రైతులకు వివిధ రకాల కూరగాయల పంటలు పందిరి పంటల పై శిక్షణ అందించినట్లు వ్యవసాయ శాస్త్రవేత్త డా. డి మోహన్ దాస్ తెలిపారు . ఈ సందర్భంగా గరిజిన రైతులకు అందించిన శిక్షణ విధానాన్ని తెలియజేశారు .

ఈ శిక్షణ అఖిల భారత వ్యవసాయ పరిశోధనా మండలి మరియు భారత నూనె గింజల పరిశోధన వారి ఆర్థిక సహాయంతో ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన గిరిజన ఉప ప్రణాళిక పథకంలో భాగంగా నిర్వహించినట్లు తెలిపారు .

రైతు వైజ్ఞానిక యాత్రలో భాగంగా అదిలాబాద్ జిల్లాలోని బజారహత్నూర్ మరియు గుడిహత్నూర్ మండలాలకు చెందిన గిరిజన రైతులకు శిక్షణ నిమిత్తం జీడిమెట్ల హైదరాబాద్ లో గల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ సమస్యలు శిక్షణ ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో గిరిజన రైతులకు పందిరి కూరగాయల పెంపకం గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది తెలిపారు.

అదే విధంగా వివిధ రకాల కూరగాయలు అయినటువంటి టమాటా, మిరప ,వంకాయ వివిధ రకాల కూరగాయల పెంపకం , నాటే విధానం మరియు యాజమాన్య పద్దతుల పై గురించి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ అధికారులు రైతులకు వివరంగా శిక్షణను అందించారు .

ఈ శిక్షణ లో సుమారు 50 మంది గిరిజన రైతులు పాల్గొన్నారు . పరిశోధనా స్థానం జగిత్యాల పరిశోధన స్థానం డాట్ మరియు అదిలాబాద్ శాస్త్రవేత్తలు డాక్టర్ డి పద్మజా మరియు డాక్టర్ డి మోహన్ దాస్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమ జరిగింది.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!