రిపబ్లిక్ హిందూస్థాన్, బోథ్ : బోథ్ మండల కేంద్రములోని 32 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను, 39 మంది లబ్ధిదారులకు ఎస్సి కార్పొరేషన్ యూనిట్లను శాసనసభ్యులు రాథోడ్ బాపురావు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపించే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని, ఎస్సి కార్పొరేషన్ ద్వారా మంజూరైన యూనిట్ లోన్లను సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక ప్రగతికి దోహద పడాలని లబ్దిదారులకు సూచించారు. ఈ కార్యక్రమములో ఎంపీపీ తుల శ్రీనివాస్, జడ్పీటీసీ సంధ్య రాణి, మండల కన్వీనర్ రుక్మాన్ సింగ్, జడ్పీ కో ఆప్షన్ మెంబెర్ తాహెర్ బిన్, మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల బోజన్న, నెరడిగొండా ఎంపీపీ రాథోడ్ సజన్, బోథ్ సర్పంచ్ సురేందర్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ భాస్కర్ రెడ్డి, ఆత్మ ఛైర్మెన్ సుభాష్, తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!