తెలంగాణ భారతదేశంలో భాగం కాదా…?
రిపబ్లిక్ హిందుస్థాన్, కుంరం భీం-ఆసిఫాబాద్ :
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి చౌక్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపు మేరకు రైతుల మహాధర్నా కార్యక్రమంలో కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జెడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మీ , ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ … నినాదాలు చేస్తూ తెలంగాణ రైతులు పండించిన వరి ధ్యాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనదు..?
-తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయాలి..
-తెలంగాణ రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇంత కక్ష ఎందుకు…?
-కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలి..
-తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొంటుందా…? కొనదా…? స్పష్టం చేయాలి..!
-రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయమంటే… కార్లు ఎక్కించి చంపుతారా…? ఇది ఎక్కడి న్యాయం..?

-తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలి..
-రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత…. విధి…!
-రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ వైఖరి కి వ్యతిరేకంగా పోరాడుదాం !!
-కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం !!
-కేంద్ర ప్రభుత్వామా కళ్ళు తెరువు.. తెలంగాణ రైతుల వరి ధాన్యం కొను..
-కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతికి వ్యతిరేకంగా పోరాడుదాం..
-పంజాబ్ రైతుల వద్ద వరి ధాన్యం కొంటూ.. తెలంగాణ రైతుల వద్ద ధాన్యం ఎందుకు కొనరు.. కేంద్ర ప్రభుత్వమా ఇదెక్కడి న్యాయం..?
-తెలంగాణ రైతులను దగా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పై పోరాడుదాం !!
-తెలంగాణ రైతుల ఐక్యత వర్ధిల్లాలి ..!
-పోరాడుదాం.. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం… !! పోరాడుదాం.. !!
-కార్పోరేట్లకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాడుదాం…పోరాడుదాం..
-రైతులను వంచిస్తున్న రాష్ట్ర బిజేపీ నాయకుల వైఖరిని ఎండగడదాం..!! తెలంగాణ రైతులను రక్షించుకుందాం..!!
-బీజేపీ అంటేనే… భారతీయ ఝూటా పార్టీ..
-ఢిల్లీ పెద్దల్లారా.. అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా..! వరి ధాన్యం కొనకుండా వంచిస్తారా..?
-పైకి దేశ భక్తి ..! లోపల కార్పోరేట్ భక్తి…!!
-బీజేపీ నేతల్లారా..ఇదేనా మీద్వంద్వ నీతి..
-రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలి…
-రైతులను వంచించడమే దేశ భక్తా…! సిగ్గు..సిగ్గు .!!
-తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలి..!!
-రాష్ట్ర బీజేపీ నేతలకు తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వరి ధాన్యాన్ని కొనిపించాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్ , వైస్ చైర్మన్ లి అన్ని మండలాల తెరాస అధ్యక్షులు , రైతు సమన్వయ అధ్యక్షులు , సింగిల్విండో చైర్మన్ లు , జెడ్పిటిసిలు , ఎంపిపిలు , ఎంపిటిసిలు , సర్పంచ్ లు తెరాస నాయకులు , రైతులు పాల్గొన్నారు .
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments