republichindustan.in
Newspaper Banner
Date of Publish : 01 October 2024, 12:34 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

జడ్పీ పాఠశాల వ్యాపార సముదాయాల్లో ఆదివాసీలకు స్థానం దొరికేనా…!?

99% బినామీల పేరిట అద్దె దుకాణాలు… గిరిజన ఆదివాసీలకు దక్కని అవకాశం…

సంవత్సరాల తరబడి అద్దె దుకాణాలలో గొల్ మాల్

Thank you for reading this post, don't forget to subscribe!

టెండర్ రోజు జరిగేది ఒకటి..  తరువాత జరిగే మ్యాజిక్..

పేదలకు దుకాణాలు దక్కకుండా పక్క ప్లాన్ …

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇచ్చోడ కు చెందిన దుకాణ సముదాయాల్లో ఏళ్లుగా ఆదివాసీలకు స్థానం దొరకడం లేదు. టెండర్ కంటే  అధికారులు , వ్యాపారుల కుమ్మక్కై దారవత్తు లక్షల్లో పెట్టేస్తారు… దీంతో నిరుపేద గిరిజన ఆదివాసీలు వేలంలో పాల్గొనకుండా చేస్తున్నారు. వేలంలో ఉదాహరణలు ₹200000 వెలకు వేలం పాట పాడి అద్దె భవనంలో ( శెట్టర్) దక్కించుకుని ఆ తరువాత మాములుగా ఏం జరుగుతుందో తెలియదు గాని … అందరికీ ఒకే ధర అంటూ ₹5000 అద్దె వసూలు చేస్తున్నారు. అయితే ఇందులో సగం అధికారుల జేబుల్లో , సగం పాఠశాలకు డబ్బు వెళ్తుందని బయట ప్రచారం.

వాస్తవానికి వేలం పాటలో నెలకు లక్ష రూపాయల అద్దె వేలం పాడడానికి కూడా వెనకడుగు వేయరు ఎందుకంటే తరువాత అంత సెట్ చేసుకుంటారు కాబట్టి.. అయితే ఇక్కడ వేలంలో సెట్టర్లు ( దుకాణాలు ) దక్కించుకున్న వారిలో కేవలం 5 నుండి 6 గురు మాత్రమే స్వతహాగా వ్యాపారం చేస్తున్నారు. మిగతా వారు అధిక అద్దె కు యితరులకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. అందులో నెలనెలా ఎంతో కొంత పాఠశాల అధికారులకు మ్యనేజ్ చేయడం కోసం ఇస్తున్నట్లు సమాచారం . ఏదేమైనా జిల్లా కలెక్టర్ ఏజెన్సీ చట్టాల పై , గిరిజన ఆదివాసీల హక్కుల పై కఠినంగా వ్యహరిస్తున్న వేళ ఇక్కడ నిరుపేద గిరిజన ఆదివాసీలకు వ్యాపారం చేసుకునే అవకాశం దొరుకుతుందా అనేది వేచి చూడాలి..