republichindustan.in
Newspaper Banner
Date of Publish : 10 October 2021, 4:30 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

రిపబ్లిక్ హిందుస్థాన్ , నిర్మల్ జిల్లా : టీజీవో నేత ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు అజ్మీర శ్యాం నాయక్ గారి జన్మదిన సందర్భంగా తెరాస పెంబి మండల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే దంపతులు అజ్మీర రేఖ శ్యాం నాయక్ గార్లు ప్రారంభించారు, అనంతరం వారు మాట్లాడుతూ క్రీడలు మన భారతీయ సంస్కృతిలో మంచి చరిత్ర కలిగినవి అని అన్నారు,వాటిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ప్రతిఒక్క యువత క్రీడలో ఆసక్తి కలిగివుండాలి అని అన్నారు.

జన్మదిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని శ్యామ్ నాయక్ గారు కేక్ కటింగ్ చేశారు, శ్యామ్ నాయక్ గారు సరదాగా కాసేపు యువకులతో పాటు కబడ్డీ ఆడారు.

అనంతరం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
పెంబి మండల కేంద్రం లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ఎమ్మెల్యే దంపతులు ప్రారంబించారు.