🔶 మట్కా అలవాటుకు బానిసై దొంగతనాలు చేసిన నిందితుడు
🔶 18 వాహనాలు స్వాధీనం, రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.*
🔶 పట్టణంలో ఈ సంవత్సరం 1000 సిసి కెమెరాలు ఏర్పాటు లక్ష్యం
🔶 సిసి కెమెరాల ఏర్పాటు లో ప్రజల తోడ్పాటు అవసరం – జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ క్రైం :
మంగళవారం స్థానిక పోలీసు హెడ్ కోటర్స్ నందు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో గత రెండు నెలలుగా రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, ఆంధ్రాబ్యాంక్ పరిసర ప్రాంతాలలో దొంగతనం జరిగిన 25 వాహనాలలో 18 వాహనాలను స్వాధీనం చేసుకున్నారని, మిగిలిన ఏడు వాహనాలను కూడా త్వరలో స్వాధీనం చేసుకుంటామని, చేసిన దొంగ మట్కా జూదానికి అలవాటుపడి డబ్బులు త్వరగా సంపాదించాలనే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. నిందితున్ని మంగళవారం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చాకచక్యంగా అరెస్టు చేశారని తెలియజేస్తూ నిందితుడు పట్టణంలోని సుందరయ్య నగర్ కాలనీ కి చెందిన *షఫీ ఖాన్ (33) s/o బాబు ఖాన్* అని తెలియజేశారు. నిందితుడు రిమ్స్ నుండి 18 వాహనాలను, ఆర్టీసీ బస్టాండ్ నుండి 5 వాహనాలను, ఆంధ్ర బ్యాంక్ వద్ద నుండి రెండు వాహనాలను దొంగతనం చేశాడని తెలిపారు.

స్వాధీనం చేసుకున్న వాహనాలను కోర్టు అనుమతితో తిరిగి అందజేస్తారని తెలిపారు. అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణంలో ఈ సంవత్సరం చివరి వరకు 1000 సీసీ కెమెరాలు ఏర్పాటు పోలీసుల లక్ష్యంగా కొనసాగుతుందని తెలియజేస్తూ, ప్రజలు దాతలు ఎవరైనా సీసీ కెమెరాలను లేదా చెక్కుల రూపంలో గాని నగదును జిల్లా పోలీసు ఆఫీసులో వచ్చే నెల మొదటి తారీకు నుండి ఇవ్వవచ్చని తెలియజేశారు. దీనికి సంబంధించిన కార్యాచరణ జరుగుతుందని తెలియజేశారు. ఈ ఆపరేషన్లో ముఖ్య పాత్ర పోషించిన సిబ్బందికి రివార్డులు అందజేసి వారిని ప్రోత్సహించడం జరిగింది, ఇలాగే ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి తగు ప్రోత్సాహం లభిస్తుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి వి ఉమెందర్, రెండవ పట్టణ సిఐ కె శ్రీధర్, ఎస్ ఐ విఠల్, బి సాజన్లల్, బి నరేష్, ఆర్ రమేష్ ,రామకృష్ణ ,కే ప్రవీణ్ కుమార్, దినేష్ ,శరత్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments