ఫిబ్రవరి 8, 2026_ఆదిలాబాదు: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదివారం (SVEEP) ఓటరు చైతన్య కార్యక్రమంలో భాగంగా స్థానిక కే.ఆర్.కె కాలనీలో భారీ ఓటరు అవగాహన ర్యాలీని నిర్వహించారు.
Thank you for reading this post, don't forget to subscribe!

అంతకుముందు కాలనీలో నిర్వహించిన అవగాహన ర్యాలీనీ ఆర్డీఓ స్రవంతి జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటును వినియోగించుకోవాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కాలనీవాసులందరితో ఓటు హక్కు వినియోగంపై కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ స్రవంతి, డివైఎస్ఓ శ్రీనివాస్, డీపీఆర్ఓ విష్ణువర్ధన్, మెప్మా పిడి రాజు పాల్గొన్నారు. అలాగే తహసిల్దార్లు శ్రీనివాస్, గోవింద్, వేణుగోపాల్‌తో పాటు ఇతర జిల్లా అధికారులు, యువత, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.