అదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని కష్టాల రామకృష్ణ కాలనీలో హర్టెక్ స్వచ్ఛంద సంస్థ మరియు ఆరోగ్య జ్యోతి స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని రకాల సేవా కార్యక్రమాలు అందించడంలో ముందుంటామని ఆరోగ్య జ్యోతి స్వచ్చంద సంస్థ అధ్యక్షులు కే నరేష్ కుమార్ అన్నారు. ప్రతి వారం వారం పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ప్రపంచంలో మనిషి ఎంత కష్టపడ్డా కడుపు నింపుకోవడానికి అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. మనిషికి కడుపునిండా అన్నం ఉన్నప్పుడే ఆయన ఏ పనినైనా సక్రమంగా వెళ్ళడని ఆయన వివరించారు. ఉదాహరణ తీసుకుంటే బైక్ కానీ కారు కానీ ఏ ఇతర వాహనం కానీ పెట్రోల్ డీజిల్ అందులో ఉంటేనే అది పనిచేస్తుందని అలాగే ప్రతి మనిషికి కడుపునిండా అన్నం ఉంటేనే మనిషి పని చేయగలడని ఆయన తెలిపారు. ఇప్పటివరకు అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలను చేపడతామని ఆయన తెలిపారు
Thank you for reading this post, don't forget to subscribe!