రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్హత్నూర్ : బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇచ్చిన తిరుచూస్తే మండల అర్థబ్ల్యూఎస్ అధికారుల పని తీరు ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. మండల కేంద్రం లోని భీమన్న కాలనిలో పెంట కుప్పల వద్ద విధ్యుత్ స్థంబానికి నల్లా కనెక్షన్ ఇచ్చి ఔరా అనిపిస్తున్నారు సదరు కాంట్రాక్టరూ అధికారులు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఇంటికి మంచి నీటి సౌకర్యం కల్పించాలనే సంకల్పాన్ని అధికారుల నిర్లక్ష్యం మిషన్ భగీరథ పథకాన్ని అబాసూపాలు చేస్తుంది. జనవాసాల్లో బిగించాల్సిన నల్లాలను అధికారులు ఇలా పెంట కుప్పల పై ఏర్పాటు చేస్తే అక్కడ ఎలా నీటిని నింపుకోవాలని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉపయోగంలో వచ్చే ప్రదేశం లో నల్లా ఏర్పాటు చేయాలనీ స్థానికులు కోరుతున్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!