republichindustan.in
Newspaper Banner
Date of Publish : 10 February 2022, 5:17 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

గంజాయి నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : గంజాయి నిర్ములన పై గ్రామాల్లో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాలు కొనసాతున్నాయి.
అదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి  ఆదేశాల మేరకు గురువారం రోజు ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో గల జామిడి గ్రామంలో గంజాయి మరియు  మాధకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాల పై అవగాహన కార్యక్రమాన్ని  ఇచ్చోడ ఎస్సై ఉదయ్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతు ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో అణువణువునా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గంజాయి సాగును మరియ గంజాయి సేవించే వారి పై దృష్టిసారిస్తున్నామన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు విక్రయించిన, సేవించిన చట్టరీత్య చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు.
నిషేధిత మత్తు పదార్థాల వ్యసనాలకు బానిసలై యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవుపలికారు. యువత తమ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా తమకు ఇష్టమైన రంగాల్లో రాణించాలని అన్నారు. గంజాయి మత్తులో యువత నేరాలు చేసి తమ జీవితాలను పాడుచేసుకోవద్దని సూచించారు. గంజాయికి బానిసగా మరి సమాజంలో నేరస్తులుగా మారవద్దని,గంజాయి సాగు చేసిన,నిల్వ ఉంచిన,సరఫరా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గుంజాయి వంటి మాధకద్రవ్యాల వినియోగం వల్ల దానిని సేవించిన వారి మానసిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉంటుందన్నారు.
గంజాయి,గుడుంబా వంటి మత్తు పదార్థాలను అరికట్టాడానికి పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. యువత,విద్యార్థుల కదలికలపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలన్నారు.  తమ ప్రాంతాల్లో ఎవరైనా గంజాయి  కలిగి ఉన్నా, సరఫరా చేసిన, సేవించినా డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్సై పేర్కొన్నారు.
గంజాయి ని సమూలంగా అరికట్టడం లో అధికారుల తో పాటు గ్రామ ప్రజల పై కూడా బాధ్యత ఉందని,పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా వాటి సరఫరా,ఉత్పత్తులు  జరిగిన,ఎవరైనా వినియోగిస్తున్న వెంటనే ప్రజలు బాధ్యతగా భావించి సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం
అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ సుభాష్ హారన్, వార్డ్ మెంబెర్ జి గోవింద్, ప్రజలు, యువకులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!