మొగుళ్లపల్లి : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి అద్భుతమైన విజయం సాధించిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు యార రవికుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ నియంతృత్వ పాలనను బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలోనే చరిత్రాత్మక పనులు చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం రోజు 18 గంటలు కష్టపడుతున్నారని, వేసే దండగ కాదని పండుగ అని కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపిస్తుందన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గా గెలిచిన సంవత్సర కాలంలోనే గండ్ర సత్యనారాయణ రావు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పయనింపచేస్తున్నారని, నియోజకవర్గ ఆవిర్భవించినప్పటి నుండి కనివిని ఎరుగని రీతిలో భారీ మెజార్టీతో గెలిచిన గండ్ర సత్యనారాయణరావు నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ఏడాది లోనే 1350 కోట్ల అభివృద్ధి పనులతో సంచలనం సృష్టించారని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్యే పనిచేస్తున్నారన్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!