ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ-2008లో నష్టపోయిన 2,367 మంది అభ్యర్థులను కాంట్రాక్టు టీచర్లుగా నియమించేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు ముమ్మరం చేసింది. ఆనాడు నష్టపోయిన వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సెప్టెంబరు నెలాఖరులో విద్యాశాఖ కోరింది. ఈక్రమంలో ఆయా ధ్రువపత్రాలను పరిశీలించి వారికి కొలువులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సంగారెడ్డి, నల్గొండ, రంగారెడ్డి, హనుమకొండ, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బాధితులున్నట్లు గుర్తించారు. ఒక్కో జిల్లాకు ఒక సీనియర్ అధికారిని పరిశీలకునిగా నియమించారు. ఈ నెల 8లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
Thank you for reading this post, don't forget to subscribe!