republichindustan.in
Newspaper Banner
Date of Publish : 27 December 2023, 5:55 am Digital Edition : REPUBLIC HINDUSTAN

పురుషుల కోసం ప్రత్యేక బస్సులు..!?

హైదరాబాద్:డిసెంబర్ 27
మహాలక్ష్మీ పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తోంది.

ఈనెల 9 నుంచి ఈ పథకం అమల్లోకి రాగా.. మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కిడికైనా ఫ్రీగా ప్రయాణించొచ్చు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో జీరో టికెట్‌తో వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు.

దీంతో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ బస్సుల్లో అనుహ్యంగా రద్దీ పెరిగింది. గతంలో నిత్యం మహిళా ప్రయాణికులు 12-14 లక్షలు ఉండగా.. ఇప్పుడు వారి సంఖ్య 30 లక్షలు దాటుతున్నట్లు ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి.

బస్సుల్లో పురుషులకు కేటాయించిన సీట్లలోనూ మహిళా ప్రయాణికులే కూర్చుంటున్నారు. దీంతో పలువురు పరుషులు తమకు ప్రత్యేక బస్సులు నడపాలని.. లేదంటే అదనపు సర్వీసులైనా నడపాలని కోరుతున్నారు. ఈ మేరకు పలువురు పురష ప్రయాణికులు వీడియోలు తీసి ఆర్టీసీ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అవసరమైన రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై ఆర్టీసీ యోచిస్తోంది. వృద్ధుల పురుషులుకు ప్రత్యేకంగా సీట్ల కేటాయిం పుపైనా కసరత్తు జరుగుతు న్నట్లు తెలిసింది.

మరోవైపు విద్యార్థులకు సైతం కొన్ని మార్గాల్లో సర్వీసులు నడిపే విషయాన్ని ఉన్నతా ధికారులు చర్చిస్తున్నారు. సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక సీట్లలో తొలి ప్రాధాన్యం ఇవ్వను న్నట్లు తెలిసింది. సమయా ల వారీగా రద్దీపై సమగ్ర సమాచారం వచ్చాక పురుషులకు, విద్యార్థులకు స్పెషల్ బస్సులు నడపడం పై ఉన్నతాధి కారులు ఆలోచన చేస్తున్నారు.

ఇది సాధ్యం కాదంటే మహిళలకు మాత్రమే ప్రత్యేక బస్సులు నడపడం.. ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయని ఆర్టీసీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.

జీరో టికెట్‌ అని మహిళా ప్రయాణికుల్ని చిన్నచూపు చూడటం సరికాదని..వారి తరఫున ప్రభుత్వం ఆ ఛార్జీ చెల్లిస్తోందని ఆర్టీసీకి చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పలురకాల ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టామని చెప్పారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి స్పెషల్ బస్సులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Thank you for reading this post, don't forget to subscribe!