republichindustan.in
Newspaper Banner
Date of Publish : 11 July 2022, 12:52 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలి

– ఏ.డి.ఈ సుబ్రమణ్యం      

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : విద్యుత్ వినియోగదారులకు ఏమైనా సమస్యలుంటే విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికలో పాల్గొని పరిష్కరించునుకోవాలని ఏ.డి.ఈ సుబ్రమణ్యం పత్రిక ప్రకటనలో తెలిపారు. సోమవారం రోజున తన కార్యాలయములో మాట్లాడుతూ ఇచ్చోడ,బజార్ హత్నూర్,బోథ్ మరియు నెరడిగొండ మండలాల విద్యుత్ వినియోగదారులు తేది 13-07-2022 బుధవారం రోజున ఇచ్చోడ మండల కేంద్రములోని విద్యుత్ కార్యాలయములో వినియోగదారులకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించబడుతాయని అన్నారు.  ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సమస్యల విషయమై ఇచ్చోడ విద్యుత్ కార్యాలయంలో సంప్రదించి మీ విద్యుత్ సమస్యలను సంప్రదించగలరని ఏ.డి.ఈ సుబ్రమణ్యం తెలిపారు.