ఇచ్చోడా (ఆదిలాబాద్ జిల్లా): Swami Vivekananda జయంతిని ఇచ్చోడాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ మానవ హక్కుల కమిటీ ఇచ్చోడా మండల చైర్మన్ గిత్తే ప్రహ్లాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి మానవ హక్కుల కార్యకర్తలు, గ్రామ పెద్దలు హాజరై వేడుకలకు ప్రత్యేక శోభను చేకూర్చారు.
ఈ సందర్భంగా గిత్తే ప్రహ్లాద్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద బోధనలు యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆయన చూపిన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వ్యక్తిత్వ వికాసం, సేవాభావం, దేశభక్తి వంటి విలువలను జీవితంలో ఆచరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఆమ్టె మాధవరావు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. వారు స్వామి వివేకానంద జీవిత సందేశాలు నేటి సమాజానికి ఎంతగానో అవసరమని పేర్కొంటూ, యువత లక్ష్యసాధనలో నిలకడగా ఉండాలని సూచించారు.
వేడుకల ముగింపులో స్వామి వివేకానంద చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన ఆలోచనలను సామాజిక సేవల రూపంలో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.
Thank you for reading this post, don't forget to subscribe!