republichindustan.in
Newspaper Banner
Date of Publish : 03 December 2024, 12:26 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

సీసీటీవీ ఫుటేజ్.. ఆర్టీసీ బస్సు కింద పడి విద్యార్థినికి తీవ్రగాయాలు

తెలంగాణ : ఆర్టీసీ బస్సు నుంచి జారి బస్సు వెనుక చక్రం కింద పడడంతో విద్యార్థిని తీవ్ర గాయాలపాలైన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పాపన్నపేట మండలం నార్సింగి చౌరస్తాలో బస్సులో ఎక్కువ మంది ఎక్కడంతో ఫుట్‌బోర్డుపై నుండి బోడ అఖిల(16) అనే విద్యార్థిని కింద పడింది. ఆమె కింద పడగా బస్సు వెనుక చక్రం అఖిల కాలుపై నుండి వెళ్ళింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీనికి సంబంధించిన దృశ్యాలు CCTVలో రికార్డయ్యాయి.