* జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో 45 బృందాలచే 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆకస్మిక దాడులు.
*వ్యవసాయ భూములు తాకట్టు పెట్టుకుని, భూములు రాయించుకొని వడ్డీలకిస్తున్న వడ్డీ వ్యాపారాలు.*
*16 మండలాలలో దాడులు 7 పోలీస్ స్టేషన్లో పరిధిలో 15 కేసులు నమోదు.
*ఆకస్మిక దాడులతో వడ్డీ వ్యాపారుల వద్ద నుండి ప్రామిసరీ నోట్లు, చెక్కులు, పాస్ బుక్కులు, బాండ్ పేపర్స్, సేల్ డేట్స్ స్వాధీనం.

ఆదిలాబాద్ : రైతులు, అమాయక ప్రజల నడ్డి విరుస్తూ వారి రక్తాన్ని పిండి పీడుస్తున్న వడ్డీ వ్యాపారులపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ కొరడా జలుపించారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాలో ఏకకాలంలో 16 మండలాలలో 45 బృందాలచే దాదాపు వందమంది వడ్డీ వ్యాపారులపై ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 7 మండలాలలో దాదాపు 15 కేసులు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. వ్యవసాయ భూములు తాకట్టు పెట్టుకుని, వ్యవసాయ భూములు తమ పేర్లపై రాయించుకొని వడ్డీ నిర్వహిస్తున్న వడ్డీ వ్యాపారుల పై దాడులు. దాడులలో వడ్డీ వ్యాపారాల వద్ద నుండి ప్రామిసరీ నోట్లో బాండ్లు చెక్కుబుక్కులు ఖాళీ పేపర్స్ స్టాంప్ పేపర్స్ సేల్ డేట్స్ లాంటివి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. జిల్లా ఎస్పీ ప్రజలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ అక్రమార్కుల ఆటలు కట్టడం చేయడం జరుగుతుంది అని, అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపే దిశగా జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు.
*పోలీస్ స్టేషన్లో వారిగా నమోదైన కేసులు మరియు నిందితుల వివరాలు*




🔹 ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు
1. నాయిని సుదర్శన్, ఖుర్షీద్ నగర్.
🔹 తలమడుగు పోలీస్ స్టేషన్ లో 2 కేసు
2. కటకం రాజు, దేవాపూర్.
3. శ్రీనివాస్, దేవాపూర్.
🔹 మావల పోలీస్ స్టేషన్లో కేసు 2 కేసులు.
4. కుంటి లింగన్న, 170 కాలనీ.
5. దుర్గారెడ్డి, మావల.
🔹 నేరడిగొండ పోలీస్ స్టేషన్లో 3 కేసులు.
6. గంగారెడ్డి, తేజపూర్.
7. శ్రీనివాస్, నేరడిగొండ.
8. జుంబేరాత్ రాహుల్, నేరడిగొండ.
🔹 తాంసి పోలీస్ స్టేషన్లో 2 కేసులు
9. ఉప్లంచి నగేష్, కప్పర్ల
10. ఉప్లంచి గంభీర్, కప్పర్ల
🔹 ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో 4 కేసులు
11. గొతి సుందర్ సింగ్
12. గిట్టే మారుతి
13. కడమ్ సుదర్శన్
14. కడమ్ సాయి కృష్ణ సిద్ధాంత్
🔹 గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు
15. దహాలే పవన్, మన్నూరు గ్రామం.
మొత్తం 15 కేసులు నమోదయాయని వివరాలను వెల్లడించారు.
ప్రజల అవసరాలను లబ్ధి చేసుకుంటూ వడ్డీ పేరుతో నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారుల ఆగడాలను అరికట్టేలా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈరోజు ఇలాంటి ఆకస్మిక తనిఖీలను చేపట్టడం జరిగిందని, అధిక వడ్డీలకు ఇచ్చే వడ్డీ వ్యాపారులు ప్రజలను మోసం చేయడం మానివేయాలని సూచించారు.