republichindustan.in
Newspaper Banner
Date of Publish : 14 January 2024, 4:42 am Digital Edition : REPUBLIC HINDUSTAN

Cricket: నేడు ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ టి20 రెండో సిరీస్

రెండో టి20 సిరీస్ కి భారత్ ( Bharat ) సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్ 1-0లో నిలిచింది. రెండో టి20లోనూ గెలిచిన సిరీస్‌ను సొంతం చేసుకో వాలనే పట్టుదలతో ఉంది.

మరోవైపు అఫ్గాన్ ( Afghanistan) కూడా విజయమే లక్షంగా పెట్టు కుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. అయితే సొంత గడ్డపై భారత్‌ను ఓడించడం అఫ్గాన్‌కు శక్తికి మించిన పనిగానే చెప్పాలి.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి చేరికతో భారత్ మరింత బలోపేతంగా మారింది.

సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లి ఆడుతున్న తొలి టి20 మ్యాచ్ ఇదే కావడంతో అందరి దృష్టి విరాట్‌పైనే నిలిచింది.ఈ మ్యాచ్‌లో అతను ఎలా ఆడుతాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

టి20 ప్రపంచకప్‌కు ముందు ఆడుతున్న చివరి టి20 సిరీస్ ఇదే కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత నెలకొంది. రానున్న వరల్డ్‌కప్‌లో కోహ్లి, రోహిత్‌లు ఆడాతారా లేదా అనే సందేహం నెలకొన్న నేపథ్యంలో అనూహ్యంగా ఇద్దరికీ అఫ్గాన్ సిరీస్‌లో చోటు దక్కింది.

ఇది ప్రస్తుతం ఆసక్తికరమైన అంశంగా తయారైంది. సీనియర్లు రోహిత్, విరాట్‌లు వరల్డ్‌కప్ టీమ్‌లో ఉంటారనే దానికి వీరి ఎంపికనే నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయప డుతున్నారు.

కాగా, తొలి మ్యాచ్‌లో సున్నాకే పెవిలియన్ చేరిన కెప్టెన్ రోహిత్ ఈసారి మెరుగైన బ్యాటింగ్ కనబరచాలనే ఉద్దేశంతో కనిపిస్తున్నాడు.

Thank you for reading this post, don't forget to subscribe!