75 సంవత్సరాల వృద్ధురాలి పై దాడి ఆపై హత్యాయత్నం.
Thank you for reading this post, don't forget to subscribe!
తన జీవితంలో ఎంతోమందికి విద్యాబుద్దులు నేర్పిన విశ్రాంత టీచర్ కు కన్నకొడుకు తో చావుదెబ్బలు తినాల్సిన దుస్థితి.
కృష్ణాజిల్లా మచిలీపట్నం టౌన్ ఆశీర్వాద పురం కు చెందిన తంటేపూడి విక్టోరియా టీచర్ గా పనిచేసి రిటైర్ అయినది. భర్త వీరా స్వామి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా చేసి ఉద్యోగ విరమణ పొందారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు…
కూతుళ్లతో మాట్లాడుతుంది అనే నెపంతో తల్లిని చావబాడిన కొడుకు, కోడలు.
దెబ్బలు తాళలేక బట్టలలో యూరిన్ పోసుకున్నాను, చావుభయంతో అర్ధరాత్రి బిక్కుబిక్కమంటూ గదిలో ఓ మూలన కూర్చుని ప్రాణాలు కాపాడుకున్నాను అని కన్నీటిపర్యంతయ్యారు.
కొడుకు, కోడలు కొట్టిన దెబ్బలకు చర్మం కమిలిపోయి నల్లగా మారిపోయింది.
తన జీతం డబ్బులతో రూపాయి రూపాయి పోగుచేసి మూడంతస్తుల భవనం నిర్మిస్తే కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా చిత్రహింసలు పెడుతున్నారని వాపోయింది.