కన్వీనర్ బావ మృతితో వ్యక్తిగత సమాచారం అందించలేక పోయారు
ఇచ్చోడ: ఈ రోజు అనగా శుక్రవారం నాడు రైతు బంధు సంబురాలు ఇచ్చోడ మండలములో ఘనంగా నిర్వహించడానికి మండలంలోని ప్రతి ప్రజాప్రతినిధి,నాయకులు,కార్యకర్తలు హజారు కావాల్సిందిగా శనివారం రోజునే టి.ఆర్.ఎస్ వాట్స్ అప్ గ్రూపుల ద్వారా సమాచారం అందించడం జరిగింది,మండలములో జరిగే ప్రతి కార్యక్రమానికి మండల కన్వీనర్ స్వయంగా ముఖ్య నాయకులకు చారవాణి ద్వారా సమాచారం అందిస్తారు కానీ ఈ రోజు దురదృష్టవశాత్తు కన్వీనర్ గారి స్వంత బావ ఏలేటి వెంకట్ రామరెడ్డి చనిపోయినట్లు సమాచారం రావడముతో తను బాధలో ఉండడం వలన ఫోన్ ద్వారా కార్యక్రమ సమాచారాన్ని ముక్య నాయకులకు అందించలేక పోయారు,ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మానవతా దృక్పధముతో అర్థం చేసుకోవాలని ఆత్మ ఛైర్మెన్ నరాల రవీందర్,వైస్ ప్రెసిడెంట్ ముస్తఫా,సోషల్ మీడియా కన్వీనర్ దాసరి భాస్కర్ తెలియచేశారు.
Thank you for reading this post, don't forget to subscribe!