• Other News
  • Live TV
  • ఆదివాసీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం — తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ విమర్శ

    ఆదివాసీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం — తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ విమర్శ

    ఇచ్చోడా, డిసెంబర్ 03, 2025:
    ఆదివాసీ హక్కుల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కొడప నగేష్ ఆరోపించారు. ఒక సంవత్సరం క్రితం (10-01-2025) సీఎం హైదరాబాదులో ఆదివాసీ సంఘాలు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి, సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని ఆయన విమర్శించారు.

    ఈ నెల 4న ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతున్న సందర్భంలో ఆదివాసుల తరఫున ఈ క్రింది ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు:

    ప్రధాన డిమాండ్లు:

    1. చట్టబద్ధత లేని లంబాడాలను S.T. జాబితా నుండి తొలగించే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.


    2. ఆదివాసీ–లంబాడా వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున, లంబాడా కులాధృవీకరణ పత్రాలు తక్షణమే నిలిపివేయాలి.


    3. G.O. Ms No.03ని పునరుద్ధరించి అమలు చేయాలి.


    4. ఆదివాసీ గూడాల్లో విద్య, వైద్యం, రోడ్లు, తాగునీరు, ఆరోగ్యం వంటి మౌలిక వసతుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి.

    ఆదివాసీలకు సంబంధించిన మరెన్నో పెండింగ్ సమస్యలను వెంటనే తీర్చాలని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నామని కొడప నగేష్ తెలిపారు.

    ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నైతం శేఖర్ — తోటి సంగం జిల్లా అధ్యక్షులు, సంగెపు రమేష్ — నాయకపోలు సంగం నాయకులు,సిడం మురళీకృష్ణ — తుడుం దెబ్బ మండల నాయకులు,
    గేడం మధుకర్ — ప్రధాన్ సంగం మండల నాయకులు,
    కాత్లీ విట్టల్ — తోటి సంగం నాయకులు,
    చాహకటి పవన్ — తుడుం దెబ్బ మండల నాయకులు ఉన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow