----సుతారి ధర్మయ్య కుటుంబానికి లక్ష రూపాయల చేయాత
సౌదీ అరేబియా : గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు తెలిపారు. రాయికల్ పట్టణానికి చెందిన గల్ఫ్ కార్మికుడు సుతారి ధర్మయ్య నవంబర్ నెలలో సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించగా సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) రియాద్ వారి ఆధ్వర్యంలో ఒక లక్ష రూపాయల చెక్కును జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా జగిత్యాలలో ధర్మయ్య భార్య విమల వారి కుటుంబ సభ్యులకు అందజేశారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ తెలుగు గల్ఫ్ కార్మికులకు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన ధర్మయ్య పార్టివ దేహాన్ని స్వస్థలం తెప్పించడంలో కంపెనీలో వారికి రావాల్సిన ఫైనాన్సియల్ బెనిఫిట్స్ వారికి అందించడంలో,ఇండియన్ ఎంబసీ వారితో మాట్లాడడం సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ రియాద్ వారి కృషి అభినందనీయమని అన్నారు.మానవ సేవే మాధవ సేవ గా భావించి సేవ చేయాలని అన్నారు.
తెలంగాణ గల్ఫ్ కార్మికులు గల్ఫ్ దేశాల్లో చనిపోతే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తుందని,గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో,గురుకులాల్లో అడ్మిషన్లు ఇస్తుందని, మరియు సంక్షేమ పథకాల అమలు కోసం ఎన్నారై అడ్వైజరీ కమిటీని కూడా ఏర్పాటు చేసిందని గల్ఫ్ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పించడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ రియాద్ అధ్యక్షులు మచ్చ శ్రీనివాస్,మాజీ మున్సిపల్ కౌన్సిలర్ క్యాదసు నవీన్,క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.
సాటా రియాద్ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చను సాటా కోర్ టీం సభ్యులు మల్లేశన్, శర్వాణి విద్యాధరణి, కోకిల ఓత్లూరి, ప్రీతి చౌహాన్, సునీతఅవినాష్, ముదిగొండ శంకర్, మహ్మద్ నూరుద్దీన్, ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, దూడం సంజీవ్, పళ్ళికొండ సంజీవ్, సింగూ నరేష్ కుమార్, అహ్మద్ అబ్దుల్ కరీం, మహమ్మద్ అబ్దుల్ ఘఫ్ఫార్, మిధున సురేష్, యోగేష్ బాబు, మురళీ క్రిష్ణ బూసి, లోకేష్ తాళ్ల, అబ్దుల్ నయీం ఖయ్యూమ్, అయాజ్, అహ్మద్ మోహియుద్దీన్ రోజ్దార్ సయ్యద్ (అస్లాం), ఫణి కుమార్ అయ్యగారి, పెంటపాటి శ్రీ చరణ్, మహమ్మద్ కమిల్ తదితరులు అభినందనలు తెలియజేశారు.