నల్లగొండ, నవంబర్ 25 : హైద్రాబాద్లోని మలక్పేట యశోద హాస్పిటల్లో గర్భిణీకి అరుదైన చికిత్స చేసి తల్లీ బిడ్డల ప్రాణాలు రక్షించినట్టు సీనియర్ గైనకాలజిస్ట్ లేపాక్షి దాసరి తెలిపారు. ఆమె మంగళవారం జిల్లా కేంద్రంలోని మనోరమ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నల్లగొండకు చెందిన ఊర్మిళ అనే గర్భిణీ ప్లాసెంటా అక్రెటా కేసుతో యశోద ఆస్పత్రికి వస్తే ఆమె సీనియర్ వైద్యులైన గైనకాలిజిస్టులతో పాటు యూరాలజీ, అనస్థీషియా సహకారంతో ఇద్దరికి ఎలాంటి అపాయం లేకుండా శస్త్ర చికిత్స చేసి సఫలమైనట్లు తెలిపారు. ఐవీఎఫ్ ద్వారా గర్భం దరించిన సదరు మహిళ ప్లాసెంటా ప్రీవియా, అక్రెటా, ప్రీ గెస్టేషనల్ డయాబెటిస్, హైపోథైరాయిడిజం, హైపర్ టెన్స్తోన్తో హాస్పటల్కు వచ్చినట్లు తెలిపారు. అయితే ఆమెకు ప్లాసెంటా అక్రెటాతో పాటు కడుపులో టీబీ కారణంగా ద్వారా బిగుసుకుపోయి కొయ్యబారిపోవటంతో శస్త్ర చికిత్స మాకు సవాలుగా మారినట్లు తెలిపారు.
అయితే ఆ సమయంలో అయితే పరీక్షల్లో ఎలక్టివ్ ఎల్ఎస్సీఎస్ చేస్తే ప్లాసెంటా పూర్తిగా అతుక్కోని పోయి ఉండటం వల్ల సబ్టోటల్ సిజేరియన్ హిస్ట్రక్టమీ చేసి గర్భాశాయాన్ని సైతం తొలగించినట్లు తెలిపారు. ప్లాసెంటా అక్రెటా ఉన్నప్పుడు రక్తస్రావం ఎక్కువగా అవుతుందని, ప్రొజెన్ పెల్విన్ ఉన్నప్పటికి సకాలంలో హైరిస్క్ చేసి శస్త్ర చికిత్స చేయటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా సత్ఫలితాన్ని ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో లక్ష్మణ్ శ్రీకాంత్, వాసుకిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.