*శుక్రవారం అర్థ రాత్రి జరిగిన సంఘటన.*
*మద్యం సేవించి బాధితునితో విచక్షణారహితంగా ప్రవర్తించిన నిందితుడు.*
*అదిలాబాద్ టు టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు*
Trending Now:
ఆడేగామా–బి సర్పంచ్ బరిలో యువ నాయకుడు విశాల్ కదం …
ఆదిలాబాద్: శుక్రవారం రాత్రి మార్కెట్ యార్డ్ నందు జైనథ్ కు చెందిన సండే మహేష్ అనే వ్యక్తితో మద్యం సేవించి దుర్భాషలాడి గొడవకు దారితీసేలా ప్రవర్తించిన మార్కెట్ యార్డ్ సెక్రటరీ కేంద్ర పండరి(45) పై బాధితుని ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో నిందితునితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు అయిందని సీఐ కె నాగరాజు తెలిపారు.
నిందితునిపై అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేయగా మద్యం సేవించినట్లు తెలిసిందన్నారు. మద్యం సేవించి రైతులతో హిస్టారీతిగా ప్రవర్తించే వారిపై పోలీసు చర్యలు తప్పవు అన్నారు.