• Other News
  • Live TV
  • ప్రజల రక్షణ భద్రత జిల్లా పోలీసుల బాధ్యత

    ప్రజల రక్షణ భద్రత జిల్లా పోలీసుల బాధ్యత

    *బీంపూర్ మండలం వడూర్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్
    *40 బైకులు, రెండు ఆటోలు, రెండు టాటా ఏస్, ఒక మ్యాక్స్ స్వాధీనం
    *8 బాటిల్ల దేశి దారు స్వాధీనం
    *సైబర్ క్రైమ్, డైల్ హండ్రెడ్, షీ టీమ్స్, గంజాయి, గుడుంబా వాటిపై అవగాహన
    *ఉదయం 5 గంటల నుండి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్
    *అదనపు ఎస్పీ ఆపరేషన్స్ బి సురేందర్ రావు.*

    Adilabad : నేరాల అదుపునకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అదనపు ఎస్పీ ఆపరేషన్ బి సురేందర్ రావు తెలియజేశారు. ప్రజల భద్రత, రక్షణ జిల్లా పోలీసుల బాధ్యతగా అభివర్ణించారు. భీంపూర్ మండలంలోని వడూర్ గ్రామం లో ఉదయం 5 గంటల నుండి జిల్లా పోలీసుల తో కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రజల రక్షణ భద్రతా చర్యల్లో భాగంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదని తెలిపారు. రోడ్డుపై ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఎట్టి పరిస్థితులను మాదకద్రవ్యాల బారిన పడకుండా వాటికి దూరంగా ఉండాలని గాంజాయి, గుడుంబా, లాంటివి జీవన విధానానికి ప్రాణహాని ని కలగజేస్తాయని తెలిపారు. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ నందు సరైన ధ్రువపత్రాలు లేనటువంటి 40 ద్విచక్ర వాహనాలను, రెండు ఆటోలను, రెండు టాటా ఏస్, ఒక మ్యాక్స్ తాత్కాలికంగా సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ తనిఖీలలో ఎనిమిది బాటిల్ల దేశి దారు లభ్యమైందని, వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరాలు పెరిగిపోయిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడా జైనథ్ సిఐ జి శ్రావణ్, భీంపూర్ ఎస్ఐ విక్రమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

    ప్రజల రక్షణ భద్రత జిల్లా పోలీసుల బాధ్యత - Additional Image
    📰 e-Paper Clip
    Google News Follow