• Other News
  • Live TV
  • బాధితులకు అండగా జిల్లా పోలీసులు ఉండేలా కర్తవ్యా బోధన

    బాధితులకు అండగా జిల్లా పోలీసులు ఉండేలా కర్తవ్యా బోధన

    * సిబ్బందికి క్రమశిక్షణ నీతి నిజాయితీ తప్పనిసరి
    * సమాజంలో పోలీసు కీర్తి ప్రతిష్టలు పెంచేలా విధుల నిర్వహణ చేపట్టాలి
    * కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం కీలకము
    * మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాల నిర్వహణ అరికట్టాలి
    * ప్రజారక్షణలో పోలీసు వ్యవస్థ అనునిత్యం పాటుపడాలి
    * స్టేషన్ రికార్డులు, పరిసరాలు, పెండింగ్ కేసుల వివరాలపై పూర్తి సమీక్ష
    * వార్షిక తనిఖీలలో భాగంగా రూరల్ పోలీస్ స్టేషన్ కార్యాలయ పరిశీలన
    * జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్

    Adilabad: ప్రజా రక్షణలో 24 గంటలు కృషి చేస్తున్న బలమైన శక్తిగా ఉండే పోలీసు వ్యవస్థ సిబ్బందికి క్రమశిక్షణ సమయపాలనతో పాటుగా, నీతి నిజాయితీలు తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. పోలీసు సిబ్బంది వ్యవస్థ కీర్తి ప్రతిష్టలను పెంచే విధంగా విధుల నిర్వహణ చేపట్టాలని సూచించారు. వార్షిక తనిఖీలలో భాగంగా రూరల్ పోలీస్ స్టేషన్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించడం జరిగింది. మొదటగా సిబ్బంది ఏర్పాటుచేసిన గౌరవ వందనాన్ని స్వీకరించి, రూరల్ సీఐ కె ఫణిదర్, ఎస్ఐ వి విష్ణువర్ధన్ పూల మొక్క అందజేసి ఆహ్వానించారు. పోలీస్ స్టేషన్ ఆవరణ ను పరిశీలించి పరిశుభ్రతపై దృష్టి సారించాలని, పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో చెట్లను నాటుతూ పచ్చదనాన్ని పెంపొందించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న వాహనాలను పరిశీలించి వాటి స్థితిగతులను కేసు పరిస్థితిలను తెలుసుకున్నారు. పోలీసు సిబ్బంది కి కేటాయించిన వస్తువులను వారి సర్వీస్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడుతూ 24 గంటలు పనిచేసే వ్యవస్థలలో పోలీసు వ్యవస్థ కీలకమైనదని ప్రజల ధన,మాన, ప్రాణ రక్షణ బాధ్యతలను పోలీసు వ్యవస్థ చేపడుతుందని, దానిని సక్రమంగా నిర్వర్తించినప్పుడు పోలీసు కీర్తి ప్రతిష్టలు సమాజంలో ఉన్నత స్థాయికి చేరుతాయని తెలిపారు. మండల పరిధిలో ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలని, గ్రామాలను సందర్శిస్తూ వారికి సైబర్ క్రైమ్, రోడ్ సేఫ్టీ క్లబ్, పోలీసు అక్క, మహిళల భద్రత, షీ టీం, ముఖ్యంగా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించాలని తెలిపారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ పూర్తి సమాచార సేకరణ చేపట్టి ప్రజలలో మమేకం కావాలని తెలిపారు. నూతన ఆవిష్కరణలను తెలుసుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసుల దర్యాప్తు పరిశోధనలు నిర్వహించాలని బాధితులకు సరైన సమయంలో న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల బాధ్యతగా వ్యవహరించి సిబ్బందిని కేటాయించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వహించే వారిపట్ల, రౌడీయిజం, గుండాయిజం చేసేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఉండాలని తెలిపారు. ప్రజల కు ఇబ్బందులు కలిగించే వారి పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఎంతటి వారినైనా ఉపేక్షించకూడదని తెలిపారు. బాధితులకు అండగా పోలీసు వ్యవస్థ ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సాయంత్రం సమయాలలో డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు. పోలీసులకు యూనిఫామ్ అనేది అందాన్నిస్తుందని, విధుల నిర్వహణలో చక్కటి యూనిఫామ్ ధరించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పూర్తిగా అడ్డు కట్టవేసేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. విధుల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి నగదు రివార్డులను ప్రశంస పత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. స్టేషన్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ కె ఫణిదర్, ఎస్ఐ వి విష్ణువర్ధన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

    బాధితులకు అండగా జిల్లా పోలీసులు ఉండేలా కర్తవ్యా బోధన - Additional Image
    📰 e-Paper Clip
    Google News Follow