- బాలయ్య–శివన్న మల్టీస్టారర్ పైనే దేశం మొత్తం చూపు
చిక్కబళ్లాపురం, నవంబర్ 22 : టాలీవుడ్‌లో మాస్ సినిమాలకు చిరునామాగా నిలిచిన బోయపాటి శ్రీను – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ నుంచి మరోసారి భారీ హంగామా మొదలైంది. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి సూపర్ హిట్ల తర్వాత తెరకెక్కుతున్న ‘అఖండ 2’ ట్రైలర్ తాజాగా విడుదలై యావత్ దేశాన్ని ఊపేస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లి, అభిమానులలో సంచలనం సృష్టించింది. బాలయ్య పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించిన దృశ్యాలు, బోయపాటి స్టైల్ యాక్షన్ సీన్స్, భారీ విజువల్స్, గర్జించే డైలాగులు కలసి ట్రైలర్‌ను పాన్ ఇండియా స్థాయి హిట్‌గా మార్చేశాయి.
ఇప్పటికే ముంబైలో జరిగిన ఫస్ట్ సాంగ్ లాంచ్, వైజాగ్‌లో జరిగిన రెండో సాంగ్ ఈవెంట్‌లకు వచ్చిన స్పందనతో సినిమాపై బజ్ బాగా పెరిగింది. తాజాగా కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈ హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ వేడుకకు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై అభిమానులను ఆశ్చర్యపరిచారు.
ఈ సందర్భంగా బాలయ్యతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న శివన్న “బోయపాటిగారు నన్ను, బాలయ్యగారిని ఒకే సినిమాలో చేస్తే నేను రెడీ” అని చెప్పగా.. బాలయ్య కూడా వెంటనే “మేము కూడా రెడీ” అని స్పందించారు. దీనిపై బోయపాటి శ్రీను “డబుల్ రెడీ సార్” అంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అక్కడున్న మాస్ ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోయారు.
ఇక సోషల్ మీడియాలో “బాలయ్య – శివన్న – బోయపాటి కాంబినేషన్ వస్తే మాస్ సునామీ గ్యారెంటీ” అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.
అయితే సినీ వర్గాల మాట ప్రకారం, వేదికలపై ఇలాంటి మాటలు సాధారణమే. నిజంగా మల్టీస్టారర్ మూవీ రూపుదిద్దుకోవాలంటే కథ, పాత్రల ప్రాధాన్యత, స్క్రీన్ బ్యాలెన్స్ లాంటి అంశాలు చాలా కీలకం. అయినా ఈ చర్చలతో ‘అఖండ 2’ క్రేజ్ మరింత పెరిగింది.
బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ భారీ మాస్ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ట్రైలర్‌తో మొదలైన ఈ హైప్ రిలీజ్ వరకు ఏ స్థాయికి చేరుతుందన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.