న్యూఢిల్లీ, నవంబర్ 17 :
రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్తున్నది ఏండ్ల తరబడి ఎలాంటి లావాదేవీలు లేకుండా నిష్క్రియంగా ఉన్న మీ బ్యాంక్ ఖాతాల్లోని నగదును తిరిగి ఇప్పటికీ పొందవచ్చు. అందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు సహాయం చేస్తున్నది. ఖాతాలోని నగదు పదేండ్లకుపైగా అలాగే ఉంటుంటే ఆ సొమ్ము.. ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (డీఈఏ) ఫండ్‌లో ఉండవచ్చు. దీన్ని క్లెయిం చేసుకోవడానికి ఇలా ప్రయత్నించండి.
ముందుగా మీ బ్యాంక్ శాఖనుగానీ, ఆ బ్యాంక్‌కు చెందిన ఏదైనా శాఖనుగానీ సంప్రదించవచ్చు.
ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ తదితర కేవైసీ పత్రాలతో ఫారంను సమర్పించాలి.
సదరు సొమ్ము మీదే అని తేలితే వడ్డీతో సహా బ్యాంక్ చెల్లించే వీలున్నది.
చివరగా..
పిల్లల భవిష్యత్తు కోసం పెద్దవాళ్లు (తల్లిదండ్రులు) బ్యాంక్ ఖాతాల్లో తమ కష్టార్జితాన్ని దాచడం, డిపాజిట్లు చేయడం సహజమే. అయితే దురదృష్టవశాత్తు డిపాజిట్‌దారులు చనిపోతే ఆ సొమ్ము గురించి వారసులకు తెలియని పరిస్థితి. ఇలాంటప్పుడు బ్యాంక్ ఖాతాలు, డిపాజిట్లకు సంబంధించిన ఏ సమాచారమున్నా ఆయా బ్యాంక్ వెబ్‌సైట్లలో వెతకవచ్చు. ఆర్బీఐ ఉద్గమ్ పోర్టల్ లో నూ చూసుకోవచ్చు. ఈ డిసెంబర్‌దాకా అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల పరిష్కారానికి దేశవ్యాప్తంగా ఆర్బీఐ ప్రత్యేక శిబిరాలనూ నిర్వహిస్తున్నది. వీటి ద్వారా కూడా మన సొమ్మును మనం తిరిగి పొందే అవకాశాలున్నాయి.
BUSINESS
పాత బ్యాంక్ ఖాతాలోని నగదు మర్చిపోయారా.. -ఇలా క్లెయిం చేసుకోండి!
Trending Now:
ఆడేగామా–బి సర్పంచ్ బరిలో యువ నాయకుడు విశాల్ కదం …
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
ఆడేగామా–బి సర్పంచ్ బరిలో యువ నాయకుడు విశాల్ కదం …
కిరాణా షాపు కోసం లోడ్ తో వచ్చిన లారితో ట్రాఫిక్... పరేషాన్ అవుతున్న జనం ...
ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారంటూ వస్తున్న వార్తలు - అసలు నిజం ఇదే
బాధితులకు అండగా జిల్లా పోలీసులు ఉండేలా కర్తవ్యా బోధన
విజయవంతంగా ముగిసిన SATA తెలుగు ప్రీమియర్ లీగ్ – 3 (SPL-3)