Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అక్రమ కొనుగోళ్లు, తుకాలలో మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు

Author
Posted By HINDUSTAN
| 21 Dec 2023, 04:46 PM | వ్యవసాయం




రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :

అక్రమ కొనుగోళ్లు, తుకాలలో మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్ లో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అక్రమ పత్తి కొనుగోళ్లు, రైతులను మోసం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ, తూనికలు కొలతల శాఖల అధికారులతో జిల్లా, మండల స్థాయిలలో కమిటీలను ఏర్పాటుచేయాలనీ సూచించారు. ఈ సమావేశంలో శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మహాతో, మార్కెటింగ్ శాఖల అధికారులు శ్రీనివాస్, మధుకర్, తదితరులు పాల్గొన్నారు.