Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గుడుంబా స్థావరాలు పై ఎక్సైజ్ దాడులు

Author
Posted By HINDUSTAN
| 17 Dec 2022, 01:37 PM | వరంగల్ రూరల్


*ఎనిమిది వందల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం, 10 లీటర్ల నాటుసార స్వాధీనం
*ఒకరిపై కేసు నమోదు
*వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ సూపర్డెంట్ మురళీధర్



రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని నందిగామ రేలకుంట లెంకాకాలపల్లి గ్రామాలలో శనివారం ఎక్సైజ్ అసిస్టెంట్ సూపర్డెంట్ మురళీధర్ ఆధ్వర్యంలో గుడుంబా స్థావరాలు పై దాడులు నిర్వహించి 8 వందల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 10 లీటర్ల నాటు సారాన్న స్వాధీనం చేసుకుని నందిగామ కు చెందిన ఇస్లావత్ గణేష్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సూపర్డెంట్ మురళీధర్ మాట్లాడుతూ నిషేధిత నాటు సారాను తయారుచేసిన విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ రాజేశ్వరి, హెడ్ కానిస్టేబుల్ సదానందం, లింగేశ్వర్, శ్రీను మరియు డిటిఎఫ్ టీం పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి