Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

చెట్టును ఢీ కొన్న బైక్.... ఇద్దరి మృతి

Author
Posted By HINDUSTAN
| 24 Jul 2022, 01:54 PM | వరంగల్ రూరల్


ద్విచక్ర వాహనం అదుపు తప్పడం తో ప్రమాదం




రిపబ్లిక్ హిందూస్తాన్ నల్లబెల్లి : ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన నల్ల రవి (50) నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామానికి చెందిన మల్లవరపు వెంకటేశ్వర్లు(65) ఇద్దరు మహేశ్వరం గ్రామంలో నీ రైస్ మిల్ లో హమాలీ కార్మికులుగా పనిచేస్తున్నారు. కాగా ఆదివారం నల్లబెల్లి మండలం శనిగరం గ్రామంలో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో
నల్లబెల్లి రుద్రగూడెం గ్రామ శివారు జాతీయ రహదారి 365 మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లుతెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ విషయమై స్థానిక ఎస్ఐ నార్లపురం రాజారాం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి