Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

విద్యార్థులకు డిఎడ్ సీట్లు ఇప్పిస్తానని మోసం చేసిన నిందితుడికి జైలు శిక్ష

Author
Posted By HINDUSTAN
| 17 May 2022, 12:04 PM | న్యాయ వ్యవస్థ


-- నిందితుడికి 3 సంవత్సరం జైలు శిక్ష తో పాటు రూ.5 వేల జరిమాన విదిస్తూ తీర్పు వెలువరించిన బోథ్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్  మేజిస్ట్రేట్ హుస్సేన్



రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ : డి ఎడ్ సీట్లు ఇప్పిస్తానని అమాయక విద్యార్థుల నుండి  లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసిన నిందితుడు మగ్గిడి దేవయ్య అనే వ్యక్తికి 3 సంవత్సరం జైలు శిక్ష మరియు రూపాయలు 5000/- జరిమాన విదిస్తూ బోథ్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్  మేజిస్ట్రేట్  హుస్సేన్ తీర్పునిచ్చారు.


ఇవి కూడా చదవండి



కేసు పూర్వపరాలు.... వివరాల్లోకి వెళ్తే  తలమద్రి గ్రామానికి చెందిన కామ్రే శంకర్ తండ్రి గంగారం అనే అతని వద్ద 2015 లో  డి ఎడ్ (D.Ed) సిటు ఇపిస్తానని జగిత్యాల కి చెందిన మగ్గిడి దేవయ్య తండ్రి గంగయ్య  అను వ్యక్తి 2 లక్షల రూపాయలు తీసుకొని డి ఎడ్ సిటు ఇప్పియకుండా  మోసం చేశాడు.  కామ్రే శంకర్ ఫిర్యాదు మేరకు ఇచ్చోడా పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 79/ 2015 U/s 420 IPC  సెక్షన్ క్రింద అప్పటి ఎస్సై బోలిమల్ల సంజీవ్ కుమార్ కేసు నమోదు చేసినారు.





కేసు విచారణ లో భాగంగా ప్రస్తుత ఎస్సై పి ఉదయ్ కుమార్, పబ్లిక్ ప్రొసీక్యూటర్ శ్రీధర్ , కోర్ట్ కానిస్టేబుల్ ఎం పురుషోత్తం లు ఆరు గురు సాక్షులను కోర్ట్ లో  ప్రవేశ పెట్టి నిందితునికి శిక్ష పడేలా చేసినారు.