Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బెస్ట్ సూపర్ మార్కెట్ .... డ్రా వ్యాపారం

Author
Posted By HINDUSTAN
| 16 Jan 2022, 02:22 PM | తెలంగాణ


ఏజెన్సీ ప్రాంతంలో సూపర్ మార్కెట్ పేరిట దుకాణం తెరిచి .... లక్కీ డ్రా టోకెన్లు ఇచ్చి అమాయక ప్రజలను మోసం చేశారా .... !?



- - వస్తువులు అమ్ముడు పోవడానికి కొత్తఎత్తుగడా....



- - డ్రా చేస్తామని ప్రకటించిన రోజు ఆన్లైన్ డ్రా చేసేసినం అని ప్రకటన.....



- - డ్రా నిర్వహించాలని ఆందోళన చేసిన డ్రా టోకెన్ దారులు


ఇవి కూడా చదవండి



రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : మండల కేంద్రంలోని బెస్ట్ సూపర్ మార్కెట్ లో డ్రా నిర్వహించాలని కొనుగోలుదారులు నిరసన చేపట్టారు.వివరాల్లోకి వెళితే.. సంక్రాంతి పండగ సందర్భంగా బెస్ట్ సూపర్ మార్కెట్ లో నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రా కూపన్ ఇచ్చారు.



ఇచ్చోడ లోని బెస్ట్ సూపర్ మార్కెట్ వద్ద ఆందోళ చేస్తున్న టోకెన్ పొందిన వినియోగదారులు


ఈ లక్కీ డ్రా లో గెలుపొందిన వారికి ఎలక్ట్రికల్ బైక్,రిఫ్రిజిరేటర్ తదితర వస్తువులు ఇస్తామని ప్రకటించి అధిక మొత్తంలో బిజినెస్ చేసుకొని తీరా డ్రా తీసే సమయానికి ఇచ్చోడలో డ్రా తీయడం లేదు మాకు సంబంధించిన అన్ని బ్రాంచ్ లలో కలిపి ఓకే దగ్గర లక్కీ డ్రా నిర్వహిస్తామని బెస్ట్ సూపర్ మార్కెట్ యజమాన్యం అనడంతో కొనుగోలుదారులు సూపర్ మార్కెట్ వద్ద ఆందోళనకు దిగారు.



ఇలాంటి లక్కీ డ్రాలను నమ్మి ప్రజలు మోసపోవద్దు అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బోథ్ నియోజకవర్గంలో గతంలో ఎంటర్ప్రైజెస్ ల పేరిట లక్కీ డ్రా నిర్వహిస్తామని ప్రజలకు కుచ్చుటోపి వేసిన సంగతి విధితమే.ఇప్పటికైనా ప్రజలు ఇలాంటి మోసపూరితమైన లక్కీ డ్రా లను నమ్మకూడదని ప్రజలు అంటున్నారు.



కాగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సూపర్ మార్కెట్ యాజమాన్యంతో మాట్లాడి..త్వరలోనే మరో డ్రా నిర్వహిస్తామని అనడంతో వ్యవహారం సద్దుమణిగింది.